E - PAPER

E-PAPER

ఏపీలో రైతులకు రూ.30వేలు ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం..

జూన్ నాలుగోతేదీన ఏపీలో అధికారం చేపట్టిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలను కూడా సమాంతరంగా అమలు చేసుకుంటూ వస్తోంది. తాజాగా అన్నదాతల కోసం పశు భీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. పశువులతోపాటు మేకలు, పందులు, గొర్రెలకు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. నాటు పశువులకు రూ.15వేలు, మేలు జాతి పశువులకు రూ.30వేల బీమా ప్రభుత్వం చేస్తుంది. రైతులెవరైనా రూ.30వేలకు మించి బీమా చేసుకోవాలనుకుంటే అందుకు అవసరమయ్యే సొమ్మును వారు చెల్లించుకోవచ్చు.

 

మూడు సంవత్సరాల కాలపరిమితి

బీమా కాలపరిధి మూడు సంవత్సరాలుగా ఉంటుంది. వీటిపై జిల్లాల్లో రైతులకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మేలు జాతి పశువు కనీసం రూ.లక్ష చేస్తుంది. తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాయితీ సొమ్మును బీమా ప్రీమియం కింద చెల్లించడానికి ఖర్చు చేస్తే అదనంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 

చెవికి ట్యాగ్ వేస్తారు

బీమా చేయించుకోవాలనే రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం, ఎస్సీ, ఎస్టీలైతే తెల రేషన్ కార్డు అందించాలని పశు సంవర్ధక శాఖ అధికారులు కోరారు. వీటికి బీమా చేసే క్రమంలో చెవికి ట్యాగ్ వేస్తారు. పశువులు మరణిస్తే వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రంలోని సిబ్బందికి సమాచారం అందించాలి. బీమాకు సంబంధించిన సర్వేయర్ వచ్చి మరణించిన జీవిని చూసేంతవరకు చెవికి ఉన్న ట్యాగ్ ను తీయకూడదు.

 

ఒకవేళ బీమా చేయించిన పశువును అమ్మివుంటే వారంలోగా బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి. దాన్ని కొనుగోలుదారు పేరుపై మార్చాలి. ప్రతి రైతు వ్యవసాయానికి అనుబంధంగా పాడిపరిశ్రమను నడుపుతున్నారని, వాటికి చాలా మంచి బీమా చేయించుకోవడంలేదని, వీటిపై అవగాహన లేకపోవడమే కారణమని, తప్పనిసరిగా బీమా చేయించుకొని వైపరీత్యాల నుంచి బయటపడాలని అధికారులు సూచిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram