E - PAPER

E-PAPER

త్వరలో ప్రత్యేక మెడికల్ స్టోర్స్ ప్రారంభిస్తాం..కేంద్ర మంత్రి..!

దేశంలోని ప్రతీ తహసీల్‌లో ఆయుష్ ఔషధాలు అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక మెడికల్ స్టోర్లను ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి ప్రతాపరావు జాదవ్ వెల్లడించారు. అందరికీ ఈ ఆయుర్వేద ఔషధాలు అందుబాటులో ఉంచే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

 

ఆయుర్వేద ఔషధాలకు మంచి గుర్తింపు లభించేలా చొరవ తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఇందౌర్, దేవాస్, ఉజ్జయినిలలో వైద్య సంస్థలను సందర్శించారు. అనంతరం అక్కడి సౌకర్యాలను తెలుసుకున్నారు. ఈ మేరకు అన్ని చోట్లా ఆయుష్ ఆస్పత్రులు అందుబాటులో ఉండాలన్నారు.

 

ఆయుర్వేదానికి సంబంధించిన సంప్రదాయం జ్ఞానం తరతరాలు వస్తోందని, ఒక తరం నుంచి మరో తరానికి అందుతుందన్నారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, అయితే గుర్తింపు లభించలేదన్నారు. ప్రస్తుతం ఈ విలువైన ఔషధాలు కొన్ని సాధారణ మెడికల్ దుకాణాల్లో మాత్రమే ఉన్నాయన్నారు.

 

ఆయుష్ మందులు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉండడంతో మందులను సూచించే వైద్యులు సైతం వాటిని రాయడం లేదన్నారు. దీంతో అటు రోగులతో పాటు వైద్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

 

పరిశోధన తర్వాత ఆయుష్ మందులు అన్ని మెడికల్ దుకాణాల్లోకి అందుబాటులోకి రావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఆయుష్ మందులు ప్రతీ చోట ఉండాలని, అందుకే దేశంలోని ప్రతి తహసీల్‌లో ఆయుష్ మందుల ప్రత్యేక మెడికల్ స్టోర్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

Facebook
WhatsApp
Twitter
Telegram