E - PAPER

E-PAPER

కోల్‌కతాలో హైటెన్షన్.. సీఎం రాజీనామా చేయాలని డిమాండ్..

కోల్‌కతా హైటెన్షన్ నెలకొంది. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం విద్యార్థి సంఘాలు పశ్చిమ్ బంగా చత్ర సమాజ్, సంగ్రామి జౌత మంచ, నబన్న అభిజన్ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి.

 

కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మంగళవారం పశ్చిమ బెంగాల్ సెక్రటేరియట్ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యార్థుల ర్యాలీని అడ్డుకునేందుకు దాదాపు 6వేల మందికి పైగా పోలీసులు బలగాలు మొహరించాయి. మరోవైపు సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలిపై ఆగస్టు 9న హత్యాచారానికి గురైంది. ఈ ఘటనను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా వైద్యులు నిరసనలు వ్యక్తం చేశారు. అయితే తొలుత ఈ ఘటనను తప్పుదోవ పట్టించేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పరిపాలనలో విఫలమైందని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram