E - PAPER

E-PAPER

ఎన్టీఆర్ డబుల్ రోల్.. ‘దేవర’ నుంచి కిక్కిచ్చే పోస్టర్..

టాలీవుడ్‌లో ప్రస్తుతం పలు బడా సినిమాలు రూపొందుతున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలు యమ స్పీడ్‌గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ హీరోల సినిమాలన్నీ భారీ బడ్జెట్‌లతో రూపుదిద్దుకుంటున్నాయి. ఈ హీరోల సినిమాల కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వీరు చేస్తున్న సినిమాలలో ముందుగా ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పుడు దానికి సంబంధించి మేకర్స్ ఓ ట్రీట్ అందించారు.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా ‘దేవర’. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్ దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇందులో అతడి నటనకు ఎంతో మంది మంత్రముగ్దులయ్యారు. కొమురం భీముడి పాత్రలో నటించిన ఎన్టీఆర్ తన ఎమోషనల్ అండ్ మాస్ యాక్టింగ్‌తో అందరినీ అలరించాడు.

 

అలాంటి యాక్టింగ్ కింగ్ ఇప్పుడు మరొక కొత్త సినిమాతో వస్తుండటంతో అందరలోనూ ఆసక్తి మొదలైంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ ‘దేవర’ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇది వరకు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి వీరి కాంబో సెట్ కావడంతో మరింత బజ్ క్రియేట్ అయింది.

 

దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ మరో స్థాయికి తీసుకెళ్లగా.. ఇటీవల విడుదలైన సాంగ్స్ అందరిలోనూ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక గ్లింప్స్ విషయానికొస్తే.. ఇందులో ఎన్టీఆర్ మాస్ యాక్షన్ సీన్లు ఓ రేంజ్‌లో ఉన్నాయి. సముద్ర తీరంలో విలన్లను నరుకుతున్న తీరు సినీ ప్రేక్షకాభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి.

 

ఈ గ్లింప్స్ అప్పట్లో విపరీతంగా యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. ఆ తర్వాత రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్ అయితే ఇక చెప్పాల్సిన పనేలేదు. ఇలా రిలీజ్ అయిందో లేదో అలా ట్రెండింగ్ అయిపోయింది. ఈ సాంగ్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అలాగే ఆ తర్వాత మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేసారు. ‘సుట్టమల్లే సుట్టేస్తుంది’ అంటూ సాగే ఈ సాంగ్ కూడా అదిరిపోయింది. ఈ సాంగ్ క్లిప్‌లతో యూట్యూబ్, ఇన్‌స్టా, షేర్ చాట్ వంటి ప్లాట్ ఫార్మ్‌లలో వీడియోలు వైరల్ అయ్యాయి.

 

ఇలా ఈ అప్డేట్‌లతో ప్రేక్షకాభిమానుల్ని ఉర్రూతలూగించిన మేకర్స్ తాజాగా మరో సర్‌ప్రైజ్ అందించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ అప్టేట్ మేకర్స్ అందించారు. ఇందులో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో నటిస్తున్నాడని ఎప్పట్నుంచో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అది నిజమని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. దేవర సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ అందించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఎన్టీఆర్ డబుల్ రోల్ పోస్టర్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. మొత్తంగా ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే నెల అంటే సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram