E - PAPER

E-PAPER

కొత్త హంగులతో తిరుమల..!

తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలో కొత్త అద్బుతం సిద్దం అవుతోంది. భక్తుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్‌ను మరిన్ని కమర్షియల్ అంశాలతో అభివృద్ధి చేసేందుకు డీపీఆర్ సిద్దమైంది. బస్సు టర్మినల్ నుంచి రైల్వే స్టేషన్‌కు స్కే వే సిద్దం కానుంది. దాదాపు రూ. 500 కోట్లతో జీ-ప్లస్ 10 అంతస్తులతో అధునాతన భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.

కొత్త హంగులతో

తిరుపతి బస్ స్టేషన్ త్వరతోనే ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్‌గా మారబోతోంది. ఈ మేరకు కేంద్రం డిజైన్స్, డీపీఆర్ సిద్దం చేసింది. 13 ఎకరాల్లో ఉన్న తిరుపతి బస్టేషన్ లో ప్రస్తుతం 66 ప్లాట్ ఫాంలు ఉన్నాయి. నిత్యం దాదాపు 1.60 లక్షల మంది రాకపోకలు సాగిస్తూ ఉంటూరు. దేశ వ్యాప్తంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే యాత్రికుల కోసం పూర్తి హంగులతో తీర్చి దిద్దాలని నిర్నయించారు. ఇందు కోసం నిర్మాణ బాధ్యతలకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్వీకరించింది. తాజాగా ఎన్‌హెచ్‌ఎం సీఈఓ ప్రకాష్ గౌర్ నేతృత్వంలో కమిటీ తిరుపతి రైల్వే స్టేషన్‌ను పరిశీలించింది.

స్కైవే

ఎలివేటెడ్ కారిడార్

ఎంపీ గురుమూర్తి, ప్రాజెక్ట్ డైరెక్టర్ పూజ మిశ్రా ఆర్టీసీ అధికారులతో సమావేశం జరిపారు. ప్రయాణికులకు కల్పించే సదుపాయాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్ళు, మరుగుదొడ్లు, ప్లాట్‌ఫాంలు, కార్యాలయాలు, ఎంట్రెన్స్ ఎగ్జిట్ పాయింట్స్, నలువైపులా ఉన్న రహదారులు, బస్సు టర్మినల్ నుంచి రైల్వే స్టేషన్‌కు స్కైవే, అండర్ పాసింగ్ తదితర అంశాలపై చర్చించారు. దాదాపు రూ. 500 కోట్లతో జీ-ప్లస్ 10 అంతస్తులతో అధునాతన భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇక ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్‌పై హెలి అంబులెన్స్ రాకపోకలు వీలుగా హెలిప్యాడ్ కూడా రాబోతోంది.

కొత్త ప్రపంచం

వచ్చే 30 ఏళ్ల వరకు సమస్య లేకుండా నిత్యం 5 వేల బస్సుల రాకపోకలు, రెండున్నర లక్షల మంది ప్రయాణికుల సందర్శనకు అనుకూలంగా నిర్మాణాలు ఉండాలని డిపిఆర్ సిద్ధం చేసింది. ఇంటిగ్రేటెడ్ బస్ స్టేషన్ నుంచి 22.1 కిలోమీటర్ వరకు తిరుమలకు నేరుగా రోడ్డు సౌకర్యం, రైల్వే స్టేషన్‌కి 800 మీటర్ల స్కైవే, 16.8 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రహదారుల సౌకర్యం ఉండేలా డిజైన్లు సిద్ధమయ్యాయి. సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు స్కైవే పేరుతో ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని డిజైన్ చేసారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram