E - PAPER

E-PAPER

తిరుపతి టీడీఆర్ స్కామ్ పై మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

తిరుపతి నగరపాలక సంస్థ సంస్థలో (తిరుపతి కార్పొరేషన్)లో జరిగిన అక్రమాలపై తప్పు చేసిన వారి మీద త్వరలో చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పు చేసిన వారు ఎవ్వరూ తప్పించుకోలేరని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ చెప్పారు. తిరుపతిలో సోమవారం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తీరుప తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థలో టీడీఆర్ బాండ్ల పంపిణీలో భారీ మొత్తంలో అవినీతి జరిగిందని, ఈ వ్యవహారంపై ఇప్పటికే ఏసీబీ విచారణ మొదలైందని చెప్పారు. తిరుపతి టీడీఆర్ బాండ్ల పంపిణీ వ్యవహారంలోనే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో బారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయని మంత్రి నారాయణ గుర్తు చేశారు.

ఇదే విషయంపై మాకు అనేక అనుమానాలు ఉన్నాయని, ఈ వ్యవహారం మొత్తం బయటకు లాగడానికి ఇప్పటికే ఏసీబీ విచారణ ఆదేశించామని మంత్రి నారాయణ గుర్తు చేశారు తిరుపతి నగరపాలక సంస్థలో టీడీఆర్ బాండ్ల పంపిణీ విషయంలో వేలాది కోట్ల రూపాయలు గోల్ మాట్ జరిగిందని ఇప్పటికే అనేకమంది ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదులు పరిశీలించిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఏసీబీ విచారణకు అనుమతి ఇచ్చిందని మంత్రి నారాయణ మీడియాకు చెప్పారు.

తిరుపతి నగరం అభివృద్ధిని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు దోచుకున్న వ్యక్తులు ఎవరైనా సరే మా ప్రభుత్వం వారిని వదిలిపెట్టదని, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ హెచ్చరించారు. సెప్టెంబర్ చివరివారంలోపు తిరుపతి టీడీఆర్ కుంభకోణం కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వస్తుందని, ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ అన్నారు.

 

గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా భారీ అవినీతి అక్రమాలు జరిగాయని మంత్రి నారాయణ ఆరోపించారు ఇతర శాఖల్లో పనిచేసే ఉద్యోగులను తిరుపతి నగరం పాలక సంస్థలు,రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీలలోకి డిప్యూటేషన్ పై తీసుకు వచ్చి ప్రభుత్వ నియమాలకు విరుద్దుంగా వారికి బాధ్యతలు అప్పగించారని, అలా వచ్చిన ఉద్యోగులు భారీ అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి నారాయణ ఆరోపించారు. వచ్చే ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖలో పూర్తి స్థాయిలో మార్పులు చేస్తామని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి నారాయణ ప్రజలకు హామీ ఇచ్చారు.

Facebook
WhatsApp
Twitter
Telegram