టాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘కన్నప్ప’ ఒకటి. పాన్ ఇండియా రేంజ్‌లో గ్రాండ్ లెవెల్లో రూపొందుతోంది. ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. ఇందులో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నాడు. ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, Ava ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై మంచు మోహన్ బాబు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.
కాగా ఇందులో స్టార్ కాస్టింగ్ నటిస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, నయనతార, బాలీవుడ్ బ్యూటీ మధుబాల వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో అంటే డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే షూటింగ్ అత్యంత వేగంగా జరుపుతున్నారు. అయితే సినిమాను తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా దర్శకుడు సఫల ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఏ విషయంలోనూ తగ్గడం లేదు. క్వాలిటీ, విజువల్స్, కంటెంట్ ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అన్ని పనులు పూర్తి చేసి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. అప్పటి వరకు ఈ సినిమాపై అంచనాలు పెంచేందుకు ఎప్పటికప్పుడు అప్డేట్‌లు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్‌కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది.
మంచు విష్ణు ఇందులో ఒక యోధుడి పాత్రలో కనిపించి కనువిందు చేశాడు. అతడి యాక్షన్ సన్నివేశాలు సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నాయి. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినీ ప్రియుల్లో సరికొత్త క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మేకర్స్ మరో అప్డేట్ అందించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ సినిమా నుంచి క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు ఈ మూవీలో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ భక్త నటిస్తున్నట్లు తెలిపారు. అవ్రామ్ ఇందులో తిన్నడు పాత్రలో నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు. ఈ పోస్టర్‌లో అవ్రామ్ స్టిల్స్ చూస్తుంటే ఆకట్టుకుంటున్నాయి.
ఇకపోతే ఈ సినిమా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో సహా తమిళ, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషల్లో భారీ రేంజ్‌లో రిలీజ్ చేయనున్నారు. కాగా ఇందులో మంచు ఫ్యామిలీ నుంచి ఏకంగా మూడు తరాలు నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే అదే సమయంలో అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2’ సినిమా డిసెంబర్ 6న గ్రాండ్‌లెవెల్లో రిలీజ్ కానుంది. మరి ఈ కన్నప్ప సినిమా ఏ డేట్‌లో రిలీజ్ అవుతుందో చూడాలి.