జమ్ము కాశ్మీర్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దాదాపు పదేళ్ల తరువాత జమ్ము కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుతున్నాయి. రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరుగనున్న ఎన్నికలు కావడంతో బీజేపీ సహా ప్రధాన పార్టీలన్నీ అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ 44 అభ్యర్థులతో కూడిన తాజాగా తొలి జాబితాను విడుదల చేసింది
మొత్తం 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, మిగతా రెండు రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. ఆగస్టు 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. బీజేపీ తమ పార్టీ నుంచి రామ్ మాధవ్, కిషన్ రెడ్డిలను ఎన్నికల ఇన్‌చార్జిలుగా ప్రకటించింది. బీజేపీ ప్రకటించిన ఈ జాబితాలో మాజీ ఉపముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్‌కు టికెట్ దక్కలేదు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది.
అనంత్‌నాగ్ వెస్ట్ నుంచి మహమ్మద్ రఫీక్ వనీ పోటీ చేయనున్నారు. పాంపోర్ నుంచి సయ్యద్ షోకాత్ గయూర్ అంద్రబీ పేరు ఖరారైంది. షోపియాన్ నుంచి జావెద్ అహ్మద్ ఖాద్రి, అనంత్‌నాగ్ నుంచి అడ్వొకేట్ సయ్యద్ వజాహత్ పోటీకి దిగనున్నారు. దోడా నుంచి గజయ్ సింగ్ రాణా పేరు ప్రకటించారు. ఇక, ఆమ్ ఆద్మీ పార్టీ ఏడుగురు అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. పుల్వామా నుంచి ఫయాజ్ అహ్మద్, ముదస్సిర్ హసన్ (రాజ్‌పుర), షేక్ ఫిదా హుస్సేన్ (దేవ్సర్), మోహిసిన్ షఫ్తకత్ మిర్ (దురు), యాసిర్ షఫి మట్టో (దోడా వెస్ట్)ను పార్టీ అభ్యర్ధులుగా బరిలో నిలిపింది.