E-PAPER

జూనియర్ డాక్టర్ అత్యాచార కేసులో సంచలన విషయాలను బయటపెట్టిన నిందితుడు..

కోల్‌కతా జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. హత్యాచారానికి గురైన వైద్యురాలి శరీరంలో అధిక మొత్తంలో వీర్యం ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో గుర్తించారు. దీంతో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఈ కేసులో ఒక్కడే నిందితుడని తేల్చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైనా సంజయ్ రాయ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కాలేజ్ ప్రిన్సిపాల్‌ను సైతం విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇన్నాళ్లు జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం చేసింది తానే అని చెప్పిన సంజయ్ రాయ్‌‌, కోర్టులో ప్లేట్ ఫిరాయించాడు. తనని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని చెప్పి అందరికి షాకిచ్చాడు.

 

ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని , తనని కావాలనే పోలీసులు ఈ కేసులో ఇరికించారని సంజయ్ రాయ్‌‌ న్యాయస్థానానికి తెలిపాడు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకే తాను లైడిటెక్టర్ టెస్ట్‌కు అంగీకరించినట్టు సంజయ్ రాయ్‌‌ కోర్టుకు తెలిపాడు. సంజయ్ రాయ్‌‌ మాట మార్చడంతో అసలు నిందితులు ఎవరనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. పోలీసులు కావాలనే అసలు నిందితులను తప్పించారనే విమర్శలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పుడు సంజయ్ రాయ్‌ సైతం తానే ఎటువంటి తప్పు చేయలేదని చెప్పడంతో కేసు మళ్లీ మొదటికొచ్చింది. దీంతో ఈ కేసును పోలీసులు నీరుగార్చరనడానికి మరింత బలం చేకూరినట్లు అయింది.

 

ఈ కేసులో పాలిగ్రాఫ్ పరీక్షకు అనుమతిచ్చిన కోర్టు సంజయ్ రాయ్‌ కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది. ఆర్‌జి కేసులో 7 మందికి పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించడానికి సీబీఐ కోర్టు నుండి అనుమతి పొందింది. ఇందులో సంజయ్ రాయ్‌‌తో సహా, ఏడుగురిలో ఆర్‌జి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కూడా ఉన్నారు. అరెస్టయిన నిందితుడు ప్రస్తుతం ప్రెసిడెన్సీ జైలులో ఉన్నాడు. దీనిలో భాగంగానే సీబీఐ అధికారులు ప్రెసిడెన్సీ జైలుకు వెళ్లారు. ఆదివారం లేదా సోమవారం పాలీగ్రాఫ్ పరీక్ష చేయవచ్చు. అంతకుముందే ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కారు సీబీఐ ఆధీనంలోకి వచ్చింది. సంజయ్ రాయ్ ఉపయోగించిన మోటార్‌సైకిల్‌ను కూడా ఫోరెన్సికల్‌గా పరిశీలిస్తామని సీబీఐ తెలిపింది.

Facebook
WhatsApp
Twitter
Telegram