E-PAPER

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు ఖారారు..!

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు ఖరారయ్యారు. కొంత కాలంగా జరుగుతున్న తర్జన భర్జతనలకు హైకమాండ్ ముగింపు పలికింది. పార్టీ సీనియర్లతో మంతనాల తరువాత బీసీ వర్గానికి చెందిన నేతకే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పదవి కోసం చివరి వరకు పలువురు పోటీ పడినా..ముఖ్యమంత్రి రేవంత్ ఛాయిస్ కే పార్టీ అధినాయకత్వం మొగ్గు చూపింది. ఈ రోజు లేదా రేపు పార్టీ నాయకత్వం టీపీసీసీ నూతన అధ్యక్షుడిని ప్రకటించనుంది.

 

టీపీసీసీ చీఫ్ గా

టీపీసీసీ చీఫ్ నియామకం పైన తాజాగా ఢిల్లీలో మంత్రాంగం జరిగింది. పార్టీ కోర్ కమిటీ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్ తో సుదీర్ఘ మంతనాలు సాగించింది. సామాజిక సమీకరణాల ఆధారంగా టీపీసీసీ చీఫ్ నియామకం చేయాలని నిర్ణయించింది. బీసీ, గిరిజన, ఎస్సీ నేతల నుంచి ముగ్గురు పేర్ల పైన చర్చ జరిగింది. సీఎం రేవంత్ అభిప్రాయం పార్టీ హైకమాండ్ పరిగణలోకి తీసుకుంది. రేవంత్ కు సహకారం అందిస్తూ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు..మిషన్ 2028 లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ ఎంపిక ఉండాలని పార్టీ కసరత్తు చేసింది.

 

రేవంత్ ఛాయిస్

అందులో భాగంగా బీసీ వర్గానికి చెందిన ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్…ఎమ్మెల్సీగా ఉన్న బొమ్మ మహేష్ గౌడ్ పేరు టీపీసీసీ అధ్యక్షుడిగా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ లోకి వచ్చిన సమయం నుంచి పీసీసీ అధ్యక్షుడుగా..సీఎం అయిన సమయంలోనూ మహేష్ పూర్తి మద్దతుగా నిలిచారు. రేవంత్ కు వ్యతిరేకంగా నాడు పార్టీలో వ్యతిరేక గళం వినిపించిన వారికి ధీటుగా మహేష్ సమాధానం ఇచ్చారు. దీంతో, తన లక్ష్యాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే క్రమంలో రేవంత్ టీపీసీసీ చీఫ్ గా మహేష్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

 

ఏఐసీసీ నిర్ణయం

తాన ఛాయిస్ చెప్పినా…పార్టీ నాయకత్వం పీసీసీ అధ్యక్షుడి నియామకంలో తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రేవంత్ స్పష్టం చేసారు. దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో.. ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎన్‌ఎస్‌యూఐ నుంచి అనేక హోదాల్లో మహేష్ కాంగ్రెస్ లో పని చేసారు. రేవంత్ సీఎం అయిన తరువాత మహేష్ ఫేట్ మారిపోయింది. ఈ ఏడాది జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఇక ఇప్పుడు టీపీసీసీ చీఫ్‌గా పదవిని అలంకరించబోతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram