ప్రస్తుతం ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా కొనసాగుతోంది. ఒక సినిమా హిట్ అయితే చాలు దానికి మరొక పార్టు వచ్చిపడుతుంది. ఇప్పటికే చాలా సినిమాలు అలా సీక్వెల్స్‌తో వచ్చి మంచి హిట్ కొట్టాయి. అందువల్లనే సినీ ప్రియులు కూడా ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. దానికి కొనసాగింపుగా సీక్వెల్ కోసం ఎంతో ఆతృతగా ఎదరుచూస్తున్నారు. అలాంటి వారికోసం ఇప్పుడు ఓ గుడ్ న్యూస్. తాజాగా ఓ సీక్వెల్ స్టార్ట్ అయింది.
కోలీవుడ్ హీరో కార్తీ నటించిన ‘సర్దార్’ మూవీకి తాజాగా సీక్వెల్ స్టార్ట్ అయింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక ‘సర్దార్’ గతంలో ప్రేక్షకుల ముందుకు ఎంతటి ఘన విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైండ్ బ్లోయింగ్ థ్రిల్లింగ్ ట్విస్టులతో బాక్సాఫీసును గడగడలాడించింది. ఎవరూ ఊహించని కలెక్షన్లను సైతం నమోదు చేసి దుమ్ముదులిపేసింది. ఇందులో కార్తీ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటించి అదరగొట్టేశాడు. తన యాక్టింగ్‌కు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు.
దర్శకుడు పీఎస్ మిత్రన్ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. సినీ ప్రియులకు ఎలాంటి యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావాలో అవి అందించి మంచి క్రేజ్ అందుకున్నాడు. అలాంటి ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ‘సర్దార్ 2’ స్టార్ట్ అయింది. తాజాగా ఈ సీక్వెల్ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లెవెల్లో ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమంలో హీరో కార్తీతో పాటు ఆయన తండ్రి శివ కుమార్, మూవీ యూనిట్ ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ‘సర్దార్ 2’ కి సంబంధించి షూటింగ్ అప్డేట్ కూడా మేకర్స్ వెల్లడించారు. ఇందులో భాగంగా మిషన్ కాంబోడియా నేపథ్యంలో సాగే ఈ సీక్వెల్ మూవీ ఈ నెల అంటే జూలై 15 నుంచి రిగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని తెలిపారు. అలాగే సర్దార్ మూవీ తెరకెక్కించిన దర్శకుడు పీఎస్ మిత్రన్ డైరెక్షన్‌లోనే సీక్వెల్ మూవీ కూడా రూపొందనున్నట్లు తెలిపారు. అయితే ఈ సీక్వెల్ చిత్రం ఫస్ట్ పార్ట్ కంటే మరింత రసవత్తరంగా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొదటి ఈ చిత్రం షూటింగ్‌ను చెన్నైలో వేసిన భారీ సెట్‌లో స్టార్ట్ చేయనున్నారు. ఆ తర్వాత కజకిస్తాన్, అజర్ బైజాన్, జార్జియాలో మిగతా చిత్రీకరణ పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఆషికా రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు.