E - PAPER

E-PAPER

అక్కడే తప్పు చేశాం ..అందుకే ఓడాం : కేటీఆర్

తెలంగాణ మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై స్పందించారు. గత ఎన్నికల్లో మా పార్టీ ఓటమికి ప్రజలతో మాకు ఏర్పడిన గ్యాప్ కారణమని కేటీఆర్ తేల్చేశారు. చేసిన అభివృద్దిని ప్రజలకు చెప్పుకోలేకనే ఓడిపోయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అబ్బద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మా ఓటమికి ప్రజలను తప్పు బట్టం లేదని తప్పు మేమే తప్పు చేశామని చెప్పుకొచ్చారాయన.

 

పార్టీలో తెలంగాణ పేరు లేకపోవడం వల్లే ఓడిపోయాం అనడానికి సాక్ష్యం లేదని, అలా అయితే హైదరాబాద్‌లో ఉన్న మొత్తం స్థానాలు ఎలా గెలుస్తామంటూ ఎదురు ప్రశ్నించారు. మా వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందని మాకు అహంకారం ఉందని కృత్రిమ ప్రచారం సృష్టించారని ఆత్మవిశ్వాసం, అహంకారానికి తేడా తెలియదన్నారు. అభివృద్ధిలో మాతో పోటీ పడలేనివారే అహంకారం అని ప్రచారం చేశారన్నారు.

 

ఇక పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఫిరాయింపుల వల్ల మాకు లాభం ఏమి జరగలేదని, ఎమ్మెల్యేలను చేర్చుకుని నష్టపోయామని ఎమ్మెల్యే హరీశ్ రావు ఈ సందర్భంగా చెప్పారు. మా పార్టీలో చేరిన వాళ్ళల్లో పది మంది ఓడిపోయారని చెప్పారు. తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు రాలేదని విమర్శించారు. ఆయన పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram