E-PAPER

తెలంగాణకు శుభవార్త వినిపించిన నరేంద్రమోడీ..!

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవాలయానికి ఘనమైన చరిత్ర ఉంది. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి.. పోతున్నాయికానీ ఈ ఆలయాన్ని దేశంలోని ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దలేకపోతున్నారు. అభివృద్ధి ఎక్కడ వేసి గొంగళి అక్కడే అన్న రీతిలో ఉంది. ఆలయ అభివృద్ధితోపాటు నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు దృష్టిపెట్టాలంటూ ఆధ్యాత్మికవేత్తలు కోరుతున్నారు. ఇటువంటి తరుణంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వేములవాడకు శుభవార్త వినిపించారు.

 

అతి త్వరలోనే మహర్దశ అతి త్వరలోనే వేములవాడ రాజన్న ఆలయానికి మహర్దశ పట్టబోతోందని, ప్రసాదం పథకంలో చేర్చనున్నట్లు బండి తెలిపారు. ఈ పథకం ద్వారా దేవాలయాన్ని అభివృద్ధి చేయడంతోపాటు కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను కూడా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ రెండింటినీ రామాయణ సర్క్యూట్ కిందకు తీసుకురావాలనే ప్రతిపాదన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో వీటిని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి మోడీ ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు.

ట్రిపుల్ ఐటీని తెస్తాం కరీంనగర్ కు ట్రిపుల్ ఐటీ లాంటి విద్యాసంస్థలను తీసుకువస్తామని, మరోవైపు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలను ఎంపికచేసే గడువు పెంచిందని, దీనిద్వారా కరీంనగర్ కు మరిన్ని నిధులు వస్తాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివల్లే వీటి గడువును పొడగించలేదని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గడువు పెంచాలని కోరారన్నారు. కరీంనగర్ నుంచి హసన్ పర్తి రైల్వే లైన్ సర్వే పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు.

 

బీఆర్ఎస్ అక్రమాలు తెలుసుకునేందుకే భారతీయ జనతాపార్టీ తెలంగాణ అధ్యక్ష పదవికి సంబంధించి అభిప్రాయ సేకరణ జరగలేదని, దీనిపై త్వరలోనే పార్టీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రంలో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు. బీజేపీలో చేరాలంటే రాజీనామా చేయాల్సి ఉండటంతో వారంతా తర్జన భర్జనలు పడుతున్నారని, బీఆర్ఎస్ చేసిన అక్రమాలను తెలుసుకోవడానికే కేశవరావును కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram