E-PAPER

బ్రిటన్ కొత్త ప్రధాని స్టార్మర్ కు మోడీ ఫోన్ కాల్-భారత్ రావాలని ఆహ్వానం..!

బ్రిటన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న కీర్ స్మార్టర్ కు భారత్ స్నేహ హస్తం అందించింది. లేబర్ పార్టీ అధినేత స్టార్మర్ కు ఇప్పటికే ఘన విజయంపై శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ .. ఇవాళ ఫోన్ కాల్ చేశారు. భారత్-బ్రిటన్ సంబంధాలను గుర్తుచేస్తూ వాటిని కొనసాగించాల్సిన అవసరాన్ని ఆయనకు వివరించారు. అలాగే భారత్ రావాలని బ్రిటన్ కొత్త ప్రధానిని ఆహ్వానించారు. ఈ మేరకు మోడీ ఓ ట్వీట్ చేశారు.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ కొత్త బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్‌మర్‌తో మాట్లాడారని, భారత్-యూకే మధ్య మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్నిబలమైన ఆర్థిక సంబంధాలతో పాటుగా మరింతగా పెంచడానికి తమ నిబద్ధతను ఇద్దరూ పునరుద్ఘాటించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం సాధించినందుకు మరోసారి ఆయన్ను అభినందిస్తూ భారతదేశాన్ని సందర్శించాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానం పలికారు.

 

కీర్ స్టార్మర్ తో మాట్లాడటం ఆనందంగా ఉందని ప్రధాని మోడీ ట్వీట్ లో తెలిపారు. యూకే ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపినట్లు వెల్లడించారు. తమ ప్రజల పురోగతి, శ్రేయస్సు, ప్రపంచ మంచి కోసం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, బలమైన ఆర్థిక సంబంధాలను మరింత లోతుగా పెంపొందించుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పటికే భారత్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కొనసాగిస్తామని స్టార్మర్ ఎన్నికల సమయంలోనే ప్రకటించారు.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram