E-PAPER

కొత్త రేషన్ కార్డులకు సంబంధించి బిగ్ అప్ డేట్..!

తెలంగాణలో లక్షల సంఖ్యలో రేషన్ కార్డు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో కొత్త రేషన్ కార్డులను ఇచ్చింది. ఆ తర్వాత ఇంతవరకు ఎవరికీ కొత్త కార్డులు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కొత్తగా కార్డులు ఇస్తారనే ఉద్దేశంతో ప్రజలు లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. మీ సేవా కేంద్రాలద్వారా దరఖాస్తులు పంపించగా తాజాగా ఆ పోర్టల్ ను ప్రభుత్వం మూసేసింది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తాను అమలు చేసే ప్రతి పథకానికి అర్హులుగా రేషన్ కార్డు ఉన్నవారినే ప్రామాణికంగా తీసుకుంటోంది. రేషన్ కార్డు లేకపోతే వారికి పథకాన్ని వర్తింపచేయడంలేదు.

 

అవన్నీ ఫేక్ వార్తలు ప్రజాపాలన ద్వారా కొత్త ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. కొందరు తెల్ల కాగితాలపై వివరాలు రాసి అందజేశారు. ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులతోపాటు మీసేవా కేంద్రాలద్వారా వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి వాటిని క్రోడీకరించనున్నారు. మీసేవ, ఆన్ లైన్ కేంద్రాల ద్వారా రేషన్ కార్డుల్లో పేర్లను తీసేస్తున్నారని, కొత్త పేర్లను చేర్చుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ గా మారాయి. దీంతో ప్రజలు మీసేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. తాజాగా పౌరసరఫరాల శాఖ అధికారులు దీనిపై స్పందించారు. అవన్నీ ఫేక్ వార్తలని తేల్చారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు రాలేదని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు.

 

అర్హులకే రేషన్ కార్డులు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఆరు గ్యారంటీలను ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అధికారం దక్కడంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఈ ఆరు గ్యారంటీల్లో కొత్త రేషన్ కార్డుల జారీ లేకపోయినప్పటికీ ప్రజలు లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేయడంతో త్వరలోనే వీటిపై ఓ నిర్ణయం తీసుకోనుంది. అర్హులైనవారికే తెల్ల రేషన్ కార్డులు అందించాలని, అనర్హులను తొలగించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram