మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ ఏడాది రెండు సినిమాలతో వచ్చిన మంచి హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో ‘గామి’ ఒకటి. ఎన్నో ఏళ్లనుంచి షూటింగ్ జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా చివరికి రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సైతం రాబట్టింది. దీని తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీతో వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.
ఇక ఇదే జోష్‌లో విశ్వక్ మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ఒకటి ‘మెకానిక్ రాకీ’ ఒకటి. యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. తేజ ముల్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేయగా.. అందరిలోనూ క్యూరియోసిటీ పెంచేసింది.
ఇక ఈ మూవీతో పాటు ‘లైలా’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. అయితే ఇందులో విశ్వక్ డిఫరెంట్ గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఎన్నడూ చూడని లేడీ గెటప్‌లో దుమ్ముదులిపేయనున్నాడు. అందుకు సంబంధించి ఇటీవల ఓ ప్రీ లుక్ కూడా బయటకొచ్చింది. అందులో లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్ ఫేస్‌ను చిన్నగా రివీల్ చేశారు. కాగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2025 ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఇదిలా ఉంటే విశ్వక్ ఇప్పుడు మరో సినిమాను లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సారి ‘జాతిరత్నాలు’ ఫేం కేవీ అనుదీప్‌తో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఈ మేరకు దర్శకుడు అనుదీప్ చెప్పిన కథకు విశ్వక్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక అన్ని సెట్ అయితే త్వరలోనే వీరి కాంబోపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనిల్ సుంకర ఈ మూవీని నిర్మించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని స్టార్ట్ చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇంతవరకు మాస్ యాక్షన్ కాన్సెప్టులతో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన విశ్వక్ ఇప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్‌తో అలరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి విశ్వక్ అండ్ అనుదీప్ పంచ్‌లు థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తాయో చూడాలి.