E-PAPER

మస్తాన్ అనే వ్యక్తితో లావణ్యకు సంబంధం ఉంది.. ప్రేయసి ఫిర్యాదుపై స్పందించిన రాజ్ తరుణ్..

నటుడు రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు చేసుకోనని అంటున్నాడని లావణ్య తాజాగా నార్సింగ్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై నటుడు రాజ్ తరుణ్ తాజాగా స్పందించాడు. 11 ఏళ్లుగా మీరిద్దరూ కలిసి రిలేషన్‌లో ఉన్నారని లావణ్య ఫిర్యాదులో పేర్కోవటం నిజమేనా అని మీడియా ప్రతినిధులు అడగ్గా.. దీనిపై స్పందించిన రాజ్ తరుణ్.. లావణ్యకు తనకు కేవలం పరిచయం మాత్రమే ఉండేదని అన్నాడు.

అయితే 8 నెలల క్రితం మస్తాన్ సాయి అనే అబ్బాయి మీద కూడా ఇలాగే ఫిర్యాదు చేసిందని అన్నాడు. ఆ ఫిర్యాదులో కూడా మస్తాన్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాలని లావణ్య కంప్లైట్ చేసిందని చెప్పుకొచ్చాడు. అయితే లావణ్య ప్రస్తుతం మస్తాన్ సాయి అనే వ్యక్తితోనే రిలేషన్‌లో ఉందని తెలిపాడు. కాగా ఇప్పుడు లావణ్య తన ఫ్లాట్ లోనే ఉంటుందని అన్నాడు. అయితే ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉండటంతో ఆమెనుంచి బయటకు వచ్చేశానని అన్నాడు.

Facebook
WhatsApp
Twitter
Telegram