తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి మంత్రి సీతక్క నేడు లీగల్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ లీగల్ నోటీసులు ఇచ్చారు మంత్రి సీతక్క. సోషల్ మీడియాలో తన ప్రతిష్టకు భంగం కలిగేలా పోస్టులు పెట్టారని సీతక్క సంచలన ఆరోపణలు చేశారు.
తనపై పెట్టిన పోస్టులపై సీతక్క ఆగ్రహం తనపై బీఆర్ఎస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క తనపై చేస్తున్న తప్పుడు ప్రచారానికి గాను లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఇందిరమ్మరాజ్యం ఇసుకరాళ్ళ రాజ్యం పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. జూన్ 24వ తేదీన బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో ఈ పోస్టులు పెట్టారని తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని సీతక్క మండిపడ్డారు.
ఇసుక అక్రమ రవాణాతో సీతక్క కు లింక్ ఉందని పోస్ట్ నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్న సీతక్క తనపై చేసిన ఆరోపణలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.అసలు ఇంతకీ బిఆర్ఎస్ పార్టీ మంత్రి సీతక్క పైన పెట్టిన పోస్ట్ ఏమిటి అంటే.. మంత్రి సీతక్క సొంత జిల్లా ములుగులో భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, ఆ మాఫియా వెనుక సీతక్క ఉన్నారని పోస్ట్ పెట్టింది.
సీతక్కపై సంచలన ఆరోపణలు లెక్కబెట్టలేని ఇసుక లారీలు అక్రమ దందా చేస్తున్నాయని ఈ అక్రమ దందా వెనుక సీతక్క ఉందంటూ వీడియోలతో పెట్టారు. వెంకటాపురం మండలం అలుబాక గ్రామం దగ్గర పట్టపగలే లారీల్లో ఇసుక తరలింపు జరుగుతుందని, ఇంతా జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని ఇసుక మాఫియా వెనుక సీతక్క ఉన్నారంటూ ఆ పోస్టులో పెట్టారు.
ఇసుక మాఫియా వెనుక సీతక్క పోస్టుపై లీగల్ నోటీసులు ఇచ్చిన సీతక్క గతంలో 16 ఇసుక లారీలు పట్టుబడిన సమయంలో సీతక్క పిఏ సుజిత్ రెడ్డి పోలీసులకు ఫోన్ చేసి లారీలను వదిలిపెట్టాలని ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందేనని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇసుక మాఫియా వెనకాల మంత్రి సీతక్క అండ ఉన్నట్టు స్థానికులు కూడా ఆరోపిస్తున్నారని పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క ఇవి తనపై చేసిన నిరాధార ఆరోపణలని అందుకే వారికి లీగల్ గా నోటీసులు పంపుతున్నానని పేర్కొన్నారు. దీనిపై తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.