E - PAPER

E-PAPER

టీజీపీఎస్సీ ముట్టడి.. ఉద్రిక్తంగా హైదరాబాద్.. అడుగడుగునా తనిఖీలు, అరెస్టులు..!

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు పోరుబాట పట్టారు. గ్రూప్ పోస్టుల పెంపుదల, గ్రూప్ వన్ మెయిన్స్ కు 1:100 నిష్పత్తి, జాబ్ క్యాలెండర్ విడుదల కోసం నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించాలని జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించే యత్నం చేశారు.

 

టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడి యత్నం… ఉద్రిక్తం అయితే అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు నగరంలో ఎకడికక్కడ ఆందోళనల కోసం వచ్చిన నిరుద్యోగులను అరెస్ట్ చేశారు. నిరద్యోగుల ఆందోళన అణచివేతకు పాల్పడ్డారు. బీజేవైఎం, బీఆర్ ఎస్ పి ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీ హైదరాబాద్లోని టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన క్రమంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

 

టీజీపీఎస్సీకి నిరుద్యోగ ఆందోళనకారులు రాకుండా చెక్ పోస్టులు హైదరాబాద్ నగర శివారులో ఉన్న బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లు మెట్రో స్టేషన్ లలో ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు.అమీర్ పేట్, ఆర్టీసీ క్రాస్ రోడ్, దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్లలో ప్రయాణికులను తనిఖీ చేసి పంపుతున్నారు. మెట్రోలో టీజీపీఎస్సీకి నిరుద్యోగ ఆందోళనకారులు వస్తారని పోలీసులు కాపలా కాస్తున్నారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన అరెస్ట్ లు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు నిరుద్యోగ జేఏసీ, బీజేవైఎం నేతలను అరెస్టు చేశారు. అన్ని జిల్లాల కేంద్రాలలోనూ టీజీపీఎస్సీ ముట్టడికి తరలివస్తున్న నాయకులను అరెస్ట్ చేశారు. నగరంలో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆందోళన కోసం వచ్చిన నిరుద్యోగులను, విద్యార్థి సంఘాల నాయకులను పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై నిరుద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

హైదరాబాద్ హోరెత్తింది గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచాలని ఈ ఏడాది మార్చి నుంచి నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. వివిధ సందర్భాల్లో తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఇక టీజీపీఎస్సీ ముట్టడి క్రమంలో టీజీపీఎస్సీ కార్యాలయం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేసిన విద్యార్థి సంఘం నేతలను కూడా అరెస్టు చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్లకు తరలించారు. నిరుద్యోగుల ఆందోళనలతో ఈరోజు హైదరాబాద్ హోరెత్తింది. రేవంత్ రెడ్డి తమ గోడు వినాలని, తమ డిమాండ్లను పరిష్కరించాలని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram