నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన ‘బింబిసార’ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు ముందు కళ్యాణ్ రామ్ హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. కానీ అవేమి ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. ఇక బింబిసార సినిమాతో మాత్రం ఘన విజయం అందుకున్నాడు. ఇందులో అతడి యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. అంతేకాకుండా సినిమా మంచి విజువల్స్‌తో సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది.
అంతేకాకుండా దర్శకుడు వశిష్ట క్రియేటివిటీని అందరూ మెచ్చుకున్నారు. ఒక్కొక్క సీన్లలో గూస్‌బంప్స్ తెప్పించే విధంగా తెరకెక్కించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఈ సినిమా చివర్లో సీక్వెల్ ఉంటుందని కూడా ప్రకటించారు. దీంతో ఈ సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి.
అయితే ఈ సీక్వెల్ ప్రకటించిన తర్వాత కూడా కళ్యాణ్ రామ్ రెండు సినిమాలు చేసి తమ అభిమానులకు ట్రీట్ అందించాడు. అందులో అమిగోస్ ఒకటి. బింబిసార వంటి సినిమా ఘన విజయం తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అలాంటి ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌గా మిగిలింది.
ఇందులో కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రల్లో నటించాడు. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీ ఫ్లాప్ కావడంతో మరో సినిమా ‘డెవిల్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి సూపర్ హిట్ కొడతాడు అని అంతా అనుకున్నారు. ఎందుకంటే సినిమా రిలీజ్‌కు ముందు విడుదైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా ప్రతీ ఒక్కటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
దీంతో ఫుల్ హైప్‌తో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి మిక్స్‌డ్ టాక్ అందుకుంది. కొందరు బాగుంది అంటే.. మరికొందరు యావరేజ్ అంటూ చెప్పుకొచ్చారు. మొత్తంగా బింబిసార సినిమా తర్వాత రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు కళ్యాణ్‌రామ్‌కు పెద్ద సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఈ రెండు సినిమాల తర్వాత కళ్యాణ్‌రామ్ ‘బింబిసార 2’తో ఒక మంచి హిట్ కొడదామని ఫిక్స్ అయ్యాడు.
ఇదే సమయంలో ఈ మూవీ విషయంలో దర్శకుడు వశిష్టతో క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తాయని తెలుస్తోంది. దీని కారణంగా వశిష్ట ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దాని తర్వాతే వశిష్ట ‘విశ్వంభర’ మూవీని టేకాప్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ‘బింబిసార-2’ ను తెరకెక్కించేందుకు దర్శకుడు అనిల్ పాదూరిని లైన్‌లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది.