E-PAPER

తెలంగాణలో కాంగ్రెస్ కొత్త బాస్ ఎవరంటే..?

గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పేరును ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపిక వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటంతో ఆ బాధ్యతలను మరొకరికి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.

 

అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే కొత్త తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడును ఎంపిక చేయాలని భావించినప్పటికి..ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై పడుతుందని పార్టీ అధిష్టానం భావించింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగియడంతో కొత్త అధ్యక్షుడుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది.ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలతో ఈ విషయంపై చర్చించారు.

 

ఈ క్రమంలో పలువురు సీనియర్ నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది. సీనియర్ నేతలు మధు యాష్కి గౌడ్ , మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు, సీనియర్ నేతలు జగ్గారెడ్డి , కోమటిరెడ్డి బ్రదర్స్ , బలరాం నాయక్ , సీతక్క తదితరుల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే వారిని పీసీసీ చీఫ్‌గా నియమిస్తే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవని అధిష్టానం భావిస్తోంది.

 

ఈక్రమంలోనే మహేష్ కుమార్ గౌడ్ వైపు అధిష్టానం ప్రజలు కూడా మొగ్గు చూపిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. రేవంత్ రెడ్డి తో మహేష్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండడం, బీసీ నాయకుడు కావడం, ఎన్ .ఎస్ .యు. ఐ నుంచి పార్టీలో ఎదిగిన నేతగా గుర్తింపు ఉండడంతో , మహేష్ కుమార్ గౌడ్‌ వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

 

రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సైతం మహేష్ కుమార్ గౌడ్ పేరును సిఫార్సు చేశారని సమాచారం. పార్టీకి ప్రభుత్వం మధ్య సమన్వయం చెడిపోకుండా బాధ్యతలు నిర్వహిస్తారని అధిష్టానం భావిస్తూ ఉండడంతో, మహేష్ కుమార్‌కు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడానికి సిద్ధమవుతున్నారట. దీనిపై ఒకటి , రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram