కాలుష్యాన్ని అధిగమించేందుకు విమానం తరహాలో 132 సీట్ల బస్సును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నాగ్‌పూర్‌లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టును చేపట్టామని వెల్లడించారు. మూడు బస్సులను కలిపి ఒకే ట్రాలీ బస్సును ఏర్పాటు చేస్తారు. ఈ బస్సు 40 సెకన్ల ఛార్జింగ్‌లో 40 కిలోమీటర్లు ప్రయాణించగలదు. విమానంలో లాగా సీటింగ్, ఏసీ, ఆహారం మరియు పానీయాలు ఉన్నాయి. వీటిని అందించడానికి ‘బస్ హోస్టెస్’లు ఉన్నారు.