E-PAPER

నామా నాగేశ్వర రావు ఇంట్లో సోదాలు..!

రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి బాగోలేదు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన ఆ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. దీంతో ఆ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడింది. పార్టీ వీడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బాయ్ చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ లో ఉన్న నేతలకు ఈడీ నోటీసులు ఇస్తోంది. తాజాగా బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావుకి చెందిన మదుకాన్ కంపెనీలో కోల్ కతా పోలీసుల సోదాలు చేశారు.

 

2022లో నమోదైన చీటింగ్ కేసులో కోల్ కతా బౌ బజార్‌ పోలీసులు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నామాకు చెందిన మధుకాన్ కంస్ట్రక్షన్స్ కార్యాలయంతో పాటు, ఆయన ఇంట్లోనూ దాడులు కొనసాగుతోన్నాయి. 2022 లోనూ నామానాగేశ్వర్ రావకు చెందిన ఇళ్లు , కంపెనీల్లో ఈడీ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో 73 కోట్లకు పైగా ఈడీ జప్తు చేసి.. జూబ్లీహిల్స్ లోని మదుకాన్ కంపెనీని ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసందే.

 

ఇప్పటికే లిక్కర్ కుంభకోణంలో ఈడీ, సీబీఐ ఎమ్మెల్సీ కవిత కేసు నమోదు చేశారు. ఆమెను ఏప్రిల్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఆమె జైలులో 109 రోజులుగా ఉంటున్నారు. అంతేకాకుండా మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేసీఆర్ హైకోర్టుకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లతో పాటు యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ ఎల్‌.నరసింహా రెడ్డి ఛైర్మన్గా విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

 

మంగళవారం పటాన్ చెరు గులాబీ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం గూడెం మహిపాల్ రెడ్డితో పాటు అతన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లల్లో ఈడీ సోదాలు చేసింది. భూగర్భ గనుల శాఖకు భారీగా సీనరేజ్ నిధులు ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో దాడులు నిర్వహించినట్లు తెలిసింది. ఇలా బీఆర్ఎస్ నేతలకు ఈడీ, సీబీఐ, పోలీసుల నుంచి నోటీసులు రావడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram