తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్నారా? ఈసారి అధికారంలోకి వస్తే ఏకంగా 15 ఏళ్ల పాటు బిఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారా? మళ్లీ అధికారంలోకి వస్తామన్న కేసీఆర్ ధీమా వెనుక బలమైన కారణం ఉందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
మళ్ళీ మనదే అధికారం.. కేసీఆర్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఇదే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్ ల తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ మనం వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రాబోతున్నామని కెసిఆర్ బల్లగుద్ది మరీ చెప్పారు. కెసిఆర్ వ్యాఖ్యలు వెనుక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఫెయిల్ అవుతుంది అన్న భావన స్పష్టంగా కనిపించింది.
కాంగ్రెస్ పార్టీలో ఆ లక్షణమే అధికారం ఇస్తుందన్న కేసీఆర్ కాంగ్రెస్ రాగానే కరెంటు కోతలు, తాగునీటి కొరత ఏర్పడ్డాయని, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు నెలకొందని పేర్కొన్న కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పిచ్చిపిచ్చి పనులతో ప్రజలతో ఛీ అనిపించుకునే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతమని చెప్పారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత కూడా రాష్ట్రంలో అలాగే జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం తమ పాలన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న దానిని ఎన్టీఆర్ పాలన తర్వాత జరిగిన పాలనతో కంపేర్ చేశారు.
కాంగ్రెస్ పాలన ఫెయిల్యూర్ పాలన .. బలంగా నమ్ముతున్న కేసీఆర్ ఎన్టీఆర్ పాలన తర్వాత జరిగిన కాంగ్రెస్ పాలనలో ఎన్టీఆర్ కూడా ఎన్నో అవమానాలు పొందాడని, ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాడని కేసీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన ఒక ఫెయిల్యూర్ పాలన అని బలమైన విశ్వాసం ఉన్న కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వచ్చే ఎన్నికలకు ప్రత్యామ్నాయం తామేనని, మళ్లీ అధికారంలోకి వస్తే 15 ఏళ్ల పాటు మనమే ఉంటామంటూ వ్యాఖ్యలు చేశారు.
హిస్టరీ రిపీట్ అవుతుందని నమ్ముతున్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలతో ఛి అనిపించుకునే లక్షణమే తమకు అధికారం తీసుకువస్తుందని కేసీఆర్ గట్టి ధీమాతో ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనను, ఆ పార్టీ వైఫల్యాలను, బాగా స్టడీ చేసిన కేసీఆర్ ఇప్పుడు కూడా మళ్లీ హిస్టరీ రిపీట్ అవుతుందనీ, తాము అధికారంలోకి వచ్చి తీరుతామని బలమైన విశ్వాసంతో ఉన్నారు. మరి కెసిఆర్ చెబుతున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ పాలనలో ఫెయిల్ అవుతుందా? లేదా ప్రజల మద్దతు పొందుతుందా? అన్నది భవిష్యత్తులో తేలనుంది.