దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఏడు దశల్లో కొనసాగుతోంది. ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయింది. తాజాగా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 సీట్లకు నిన్న పోలింగ్ జరిగింది. దీని తర్వాత ప్రధాని మోడీ స్పందిస్తూ.. రెండో దశ పోలింగ్ కూడా బాగా జరిగిందన్నారు. ఇవాళ ఓటు వేసిన భారతదేశంలోని ప్రజలకు కృతజ్ఞతలు. ఎన్డీయేకు అనూహ్య మద్దతు ప్రతిపక్షాలను మరింత నిరాశకు గురి చేయనుంది. ఓటర్లు ఎన్డీయే సుపరిపాలన కోరుకుంటున్నారు. యువత మరియు మహిళా ఓటర్లు బలమైన NDA మద్దతును బలపరుస్తున్నారు.అంటూ మోడీ ఎక్స్ లో పోస్ట్ చేసారు.
దీనిపై కాంగ్రెస్ సెటైర్లు వేసింది. తొలి దశ పోలింగ్ తర్వాత, రెండో దశ పోలింగ్ తర్వాత ప్రధాని మోడీ స్పందనను గుర్తుచేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. మోడీ సర్కార్ వెళ్లిపోయింది. ఇది కొన్ని రోజులుగా బీజేపీ సర్కార్. నిన్నటి నుంచి ఎన్డీయే సర్కార్.. ఏప్రిల్ 19 నుండి జరిగిన నాటకీయ మార్పును మీరు గమనించారా? ఏప్రిల్ 5 మరియు ఏప్రిల్ 19 మధ్య కాంగ్రెస్ మేనిఫెస్టోను మోదీ విస్మరించారు. ఏప్రిల్ 19న జరిగిన మొదటి దశ ఎన్నికల తర్వాత, మేనిఫెస్టో కొత్త స్థాయిని సంతరించుకుంది.” అంటూ పేర్కొన్నారు. చివర్లో ధ్యాంక్యూ ప్రైమినిస్టర్ అన్నారు.
దేశంలో తొలి దశ పోలింగ్ జరిగిన లోక్ సభ నియోజకవర్గాల్లోనే బీజేపీ ప్రదర్శన అంతంత మాత్రంగా ఉండొచ్చన్న అంచనాలు వచ్చాయి. ఇప్పుడు రెండో దశ పోలింగ్ తర్వాత ప్రధాని స్పందన చూస్తే.. మిత్రపక్షాల అండ లేకుండా బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్ధితి లేదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.








