E-PAPER

మల్లారెడ్డిని సస్పెండ్ చేయకుండా సమర్ధిస్తున్న కేటీఆర్ మతలబు అదే: సీఎం రేవంత్ రెడ్డి..

మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి ఈటల రాజేందర్ గెలుస్తారని మాట్లాడిన మాజీ మంత్రి మల్లారెడ్డి ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్ధించడం చాలా విడ్డూరంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయనను సస్పెండ్ చేయకుండా ఆయన వ్యాఖ్యలను కేటీఆర్ ఎందుకు సమర్థిస్తున్నారో చెప్పాలని పీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

 

మల్లారెడ్డిని సస్పెండ్ చేయంది అందుకే మల్లారెడ్డి అత్యుత్సాహంతోనో.. అమాయకత్వం తోనో ఈటల రాజేందర్ గెలుస్తాడని చెప్పాడని, ఆ మాటలు అన్నందుకు మల్లారెడ్డి పై ఎలాంటి చర్య ఎందుకు తీసుకోలేదు అన్నదాని వెనుక చాలా అర్థం ఉందన్నారు. బిజెపి, బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో కూడబలుక్కున్నాయని అర్థమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బిజెపితో బీఆర్ఎస్ పార్టీకి నిజంగానే వైరం ఉంటే మల్లారెడ్డిని వెంటనే కేటీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వరా ? గత ఎన్నికల్లో మల్కాజ్గిరి నుండి పోటీ చేసిన తనను ఓడించడం కోసం 31 సమావేశాలు పెట్టారని, ఇప్పుడు ఒక్క సమావేశం కూడా ఎందుకు పెట్టలేదో చెప్పాలన్నారు. ఈటల గెలుస్తారని మల్లారెడ్డి ఉన్నది ఉన్నట్టు చెప్పి కుండ బద్దలు కొట్టారని, కనీసం ఆయనకు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదని, వివరణ కూడా అడగలేదు అన్నారు.

 

బీజేపీకి మేలు చేసే ప్రయత్నం .. కూతురి కోసమే ఈటల రాజేందర్ కూడా బీఆర్ఎస్ అధినేత కేసిఆర్, కేటీఆర్ లను ఒక్క మాట కూడా అనడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఐదు స్థానాలలో బీజేపీని గెలిపించడం కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బయటకి బిజెపిని ఓడిస్తామని రంకెలు వేస్తున్నారని, కానీ లోపాయికారిగా బిజెపికి మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జైల్లో ఉన్న కూతురు కోసం బిజెపితో అంటకాగుతున్నారు అని ఆరోపించారు.

 

గంటలు గంటలు తినటానికి బకాసురుడివా.. కేసీఆర్ ఇక ఇదే సమయంలో మహబూబ్ నగర్ లో తాను తింటూ ఉంటే రెండుసార్లు కరెంటు పోయిందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పైన మండిపడిన రేవంత్ రెడ్డి గంటలు గంటలు తినడానికి ఆయన ఏమైనా బకాసురుడు అంటూ ఎద్దేవా చేశారు. గతంలోని కరెంటు కోతలు అంటూ సూర్యాపేటలో ఇలాగే చెప్పారని, ఇన్ని అబద్ధాలు ఆడడం దేనికంటూ ప్రశ్నించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram