ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమతి 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఎగురవేశారు.
అనంతరం కేటీఆర్ పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ప్రాణాలను అర్పించిన అమర వీరులకు కేటీఆర్ నివాళి అర్పించారు. మాజీ మంత్రులు, పలువురు సీనియర్ నాయకులు ఇందులో పాల్గొన్నారు.
పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగు పెట్టారు. తన పేరు మీద ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ ఓపెన్ చేశారు. ఈ అకౌంట్ అడ్రస్.. @KCRBRSPresident. ఇప్పటిదాకా కూడా ఆయనకు ఎక్స్ ప్లాట్‌ఫామ్ మీద ఎలాంటి అధికారిక అకౌంట్ హ్యాండిల్ లేదు.
ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల కాలంలో సీఎంఓ అధికారిక అకౌంట్.. @TelanganaCMO లో కొనసాగారాయన. ప్రభుత్వ పరంగా అధికారిక కార్యక్రమాలు, సమీక్షల వివరాలను అందులో పోస్ట్ చేస్తూ వచ్చారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ కూడా @BRSparty హ్యాండిల్‌లో పోస్ట్ అయ్యేవి.
ఇక తొలిసారిగా తన పేరు మీద ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ శుభాకాంక్షలను తెలియజేస్తూ తొలి పోస్ట్ పెట్టారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగిస్తోన్న ఫొటోను ఆయన దీనికి జత చేశారు. అలాగే- ఇన్‌స్టాగ్రామ్ కూడా తన పేరు మీద తెరిచారు కేసీఆర్.
ఈ అకౌంట్ ఓపెన్ అయిన కొద్దిసేపటికే 10,400 మందికి మందికి పైగా ఫాలో కొట్టారు. కేసీఆర్‌కు విషెస్ చెబుతూ వేలాదిమంది పోస్టులు పెట్టారు. కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్ అధికారిక అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు.








