రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పగానే ఒకప్పుడు శివ, అంతం, క్షణం క్షణం వంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమాలు గుర్తుకు వచ్చేవి. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చెప్పగానే పిచ్చి పిచ్చి సినిమాలు , అమ్మాయిలతో రొమాన్స్ మాత్రమే గుర్తుకు వస్తున్నాయి. అయితే రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా ఎలా ఉన్నప్పటికీ ఆయనలో గొప్ప టెక్నీషియన్ ఉన్నారనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ చాలా అమ్మాయిలతో ఫొటోలు దిగుతుంటారు.
వర్మతో ఫొటోలు దిగడం వల్ల సెలబ్రిటీలుగా మారిన లిస్ట్ కూడా పెద్దదే. అరియానా, అషు రెడ్డి, ఇనయా సుల్తానా వంటి వారు రామ్ గోపాల్ వర్మతో ఫొటోలు దిగిన తరువాతే పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తాజాగా ఓ స్టార్ యాంర్ రామ్ గోపాల్ వర్మ నైజాన్ని బయటపెట్టింది. అది మరెవ్వరో కాదు స్పోర్ట్స్ యాంకర్ వింధ్య.స్పోర్ట్స్ ఛానల్స్‌లో తెలుగు ప్రజెంటర్‌గా యాంకర్ వింధ్య విశాఖ అందరికీ పరిచయమే. ముఖ్యంగా ఐపీఎల్ వచ్చిందంటే ఈ పాప సందడి మాములుగా ఉండదు.
బుల్లితెరపై యాంకర్ వింధ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, ఆడియో వేడుకలకు హోస్ట్ చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ పలు ఆసక్తికర అంశాలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ గురించి వింధ్య ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. యాంకర్లను టార్గెట్ చేస్తూ చేసే డబుల్ మీనింగ్ కామెంట్లపై మీ ఒపీనియన్ ఏంటి అని ఆమెను ప్రశ్నించగా నా వరకు నేను జాగ్రత్తగా ఉంటానని ఆమె తెలిపారు.
ఆర్జీవీ హాజరయ్యే ఈవెంట్స్‌కు జాగ్రత్తగా ఉంటానని ఈ భామ తెలిపింది. అయితే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటానని ఆమె పేర్కొన్నారు.ఆర్జీవీకి చనువిస్తే అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారని వింధ్య వెల్లడించారు. అందుకే రామ్ గోపాల్ వర్మకు నేను అంత సీన్ ఇవ్వనని వింధ్య చెప్పుకొచ్చింది. రామ్ గోపాల్ వర్మను పొగుడుతూ కామెంట్లు చేస్తే డబుల్ మీనింగ్ సెటైర్లతో రెచ్చిపోతాడని .. అందుకే అతనితో ఒక్క మాట కూడా మాట్లాడనని మన లిమిట్స్ లో మనం ఉంటే మనల్ని ఎవరూ టచ్ చేయలేరని ఈ స్పోర్ట్స్ యాంకర్ చెప్పుకొచ్చింది.