ప్రభాస్ హీరో వస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా గురించి ఏదో ఒక న్యూస్ ప్రతిరోజూ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. బాహుబలి, సలార్ వంటి సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. ఇప్పడు కల్కి సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా రీలిజ్ డేట్‌పై సోషల్‌మీడియాలో తెగ రూమర్స్ వచ్చేస్తున్నాయి. మొదట్లో మే 9న రిలీజ్ డేట్ అని ప్రకటించినా, అది కాస్తా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మరో కొత్త డేట్ ఇప్పడు తెరపైకి వచ్చింది. ఇది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను జూన్ 27కి షిప్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవలే ఈ మూవీ మేకర్స్ డిస్టిబ్యూర్లను కలిసారట. ఈ సమావేశంలోనే కల్కి సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి చర్చలు చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ సినిమా విడుదలను జూన్ 27కి షిప్ట్ చేశారని అంటున్నారు. దీంతో ఈ సినిమా మేకర్స్ జూన్ 27 తేదీని లాక్ చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ వార్తలపై నేడు (ఏప్రిల్ 27)న క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కల్కి సినిమా వాయిదా గురించి కానీ, కొత్త రిలీజ్ డేట్ గురించి కానీ చిత్ర యూనిట్ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జానర్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కల్కి సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ఇక ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీలు నటిస్తున్నారు. అందులో దీపికా పదుకొణె దీశా పటనీ వంటి వారితో పాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కల్కి సినిమాతో పాటు పలు ప్రాజెక్టులు కూడా ప్రభాస్ చేతిలో ఉన్నాయి. సలార్ 2, రాజాసాబ్ వంటి మూవీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు