E-PAPER

వాట్సాప్ షట్ డౌన్ హెచ్చరిక..!

సోషల్ మీడియా ఛాట్ ప్లాట్ ఫారమ్ వాట్సాప్ భారత్ లో తన సేవల్ని నిలిపిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. దీనికి కారణం వాట్సాప్ లో అనుసరిస్తున్న ఎండ్ టూ ఎండ్ చాట్ ఎన్ క్రిప్షన్ ను బ్రేక్ చేయాలంటూ పెరుగుతున్న ఒత్తిడే. వాట్సాప్ యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారి కాల్స్, వీడియోలు, ఛాట్ మెసేజ్ లను ఇతరులకు లీక్ కాకుండా ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ విధానం అనుసరిస్తోంది. అయితే తాజా ఐటీ నిబంధనల ప్రకారం దీన్ని బ్రేక్ చేయాలనే ఒత్తిడి కేంద్రం నుంచి పెరుగుతోంది.

 

ఈ నేపథ్యంలో వాట్సాప్ ఛాట్ ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ను భవిష్యత్తులో బ్రేక్ చేయాల్సి వస్తే భారత్ లో తన సేవలు నిలిపేస్తామని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. యూజర్ల డేటా భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని వాట్సాప్ తెలిపింది. తమ వాట్సాప్ చాట్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేశామని, ఇది వినియోగదారులను సురక్షితంగా ఉంచుతుందని వెల్లడించింది. అయితే సమీప భవిష్యత్తులో చాట్ ఎన్‌క్రిప్షన్‌ను బ్రేక్ చేయవలసి వస్తే మాత్రం భారత్ లో తన సేవలను నిలిపివేస్తామని మెసేజింగ్ యాప్ హెచ్చరించింది.

చాట్‌లు, కాల్‌లు, వీడియోలు, ఇతర డేటా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వెనుక వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్లు వాట్సాప్ చెప్తుండగా.. కేంద్రం మాత్రం కొత్త ఐటీ రూల్స్ ప్రకారం డేటా తాము కోరినప్పుడు బయటపెట్టాల్సిందేనని చెబుతోంది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇందులోనే వాట్సాప్ తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. తమ ప్లాట్ ఫారమ్ లో డేటా సురక్షితంగా ఉన్నందునే భారత్ లో మిలియన్ల యూజర్లు దీన్ని వాడుతున్నారని తెలిపింది.

Facebook
WhatsApp
Twitter
Telegram