E-PAPER

ఏపీలో మోడీ టూర్ షెడ్యూల్ మార్పు..

ఏపీలో ఎన్డీయే పార్టీల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్నారు. అయితే ప్రధాని పర్యటన షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో ప్రధాని తన ప్రచారంలో భాగంగా నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం కూడా షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

 

రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ మేరకు ప్రధాని మోడీ వచ్చే నెల 3, 4 తేదీల్లో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. విజయవాడ, అనకాపల్లి, రాజమండ్రి, పీలేరు సభల్లో ప్రధాని పాల్గొనాల్సి ఉంది. అయితే ఇప్పుడు మారిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 7, 8 తేదీల్లో ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మోడీ.. రాష్ట్రంలో ఈ మేరకు తన షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

 

ఎన్డీయే కూటమి ఏర్పాటు అయ్యాక రాష్ట్రంలో ఇప్పటికే ఓసారి ప్రధాని మోడీ పర్యటించారు. పల్నాడులోని చిలకలూరిపేట వద్ద జరిగిన ఎన్డీయే కూటమి సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇప్పుడు మే 7,8 తేదీల్లో సభలు నిర్వహించడం ద్వారా ఎన్నికల పోలింగ్ తేదీ కంటే ముందే ప్రచారం చేయాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఉత్తరాదిలో కూడా ప్రధాన రాష్ట్రాల్లో పోలింగ్ ముగియనుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram