E-PAPER

జగన్ కు ధీటుగా, చంద్రబాబు కొత్త టార్గెట్..

ఏపీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల ఘట్టం పూర్తి కావటంతో మేనిఫెస్టో పైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేసాయి. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ మేనిఫెస్టో ప్రకటించింది. ఈ రోజున సీఎం జగన్ తన పార్టీ మేనిఫెస్టో ప్రకటించనున్నారు. జగన్ మేనిఫెస్టోకు ధీటుగా తాము ప్రకటించే మేనిఫెస్టో రూపకల్పనకు చంద్రబాబు నిర్ణయించారు. మూడు పార్టీల ఉమ్మడి ప్రణాళికగా మేనిఫెస్టో ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసారు.

 

వైసీపీ మేనిఫెస్టో ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు వైసీపీ మేనిఫెస్టో ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేసామని జగన్ ప్రతీ సందర్భంలో చెబుతున్నారు,. 2014లో చంద్రబాబు కూటమి ఇచ్చిన హామీలను విస్మరించిన తీరును ప్రచారం సభల్లో వివరిస్తున్నారు. తాను చేసేదే మేనిఫెస్టోలో చెబుతానని స్పష్టం చేసారు.

 

గతంలో అమలు చేసిన నవరత్నాలను కొనసాగిస్తూనే.. కొత్త హామీల దిశగా జగన్ మేనిఫెస్టో సిద్దం అయినట్లు తెలుస్తోంది. రైతులు, మహిళలతో పాటుగా ఈ సారి యువత లక్ష్యంగా జగన్ మేనిఫెస్టో ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొన్ని పథకాల పరిమితి పెంచుతారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

చంద్రబాబు కసరత్తు ఇటు జగన్ మేనిఫెస్టోలో అంశాలను పరిశీలించిన తరువాత కూటమి నేతలు మేనిఫెస్టోకు తుది రూపు ఇవ్వనున్నారు. వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ధీటుగా చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. మహిళా ఓట్ బ్యాంక్ పైన చంద్రబాబు, పవన్ గురి పెట్టారు. బీజేపీ కేంద్రంలో ప్రకటించిన మేనిఫెస్టో అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఏపీలో ప్రకటించే మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు.

 

2014లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఇప్పటికీ జగన్ ఆరోపణలు చేస్తున్న సమయంలో చంద్రబాబు ఈ సారి అప్రమత్తం అయ్యారు. జగన్ ఇచ్చే హామీలను పరిశీలించి..వాటి కంటే మెరుగ్గా హామీలు ఇస్తూనే సంపద స్పష్టి గురించి వివరిచంటం ద్వారా ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేయాలనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.

 

వైసీపీకి ధీటుగా అయితే, జగన్ రుణమాఫీ ప్రకటన పైన సందిగ్ధత కొనసాగుతోంది. జగన్ రుణమాఫీ ప్రకటించకపోతే..చంద్రబాబు కూటమి రుణమాఫీ వంటి హామీలు ఇస్తుందా లేదా అనేది కీలకంగా మారుతోంది. అదే సమయం లో జగన్ అప్పులు తెచ్చి సంక్షేమం పేరుతో ప్రచారం చేస్తున్నారని తాము చేస్తున్న ప్రచారానికి అనుగుణంగానే పథకాల ప్రకటన విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని నిర్ణయించారు. అయితే, రైతులు – మహిళా ఓట్ బ్యాంక్ ను ఆకట్టుకొనే విధంగా కూటమి మేనిఫెస్టో ఉంటుందని చెబుతున్నారు. దీంతో, జగన్ ప్రకటించే మేనిఫెస్టో – 30న కూటమి మేనిఫెస్టో ఇప్పుడు ఏపీలో హోరా హోరీగా సాగుతున్న ఎన్నికల వేళ గేమ్ ఛేంజర్ గా మారే అవకాశం కనిపిస్తోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram