ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు విశాఖ జిల్లా యంత్రాంగం ఝలక్ ఇచ్చింది. నగరంలోని గవర్నర్ బంగ్లాలో విలేకరుల సమావేశం నిర్వహించేందుకు ఆయనకు అనుమతి నిరాకరించింది. ఇన్నాళ్లు మంత్రి ఇక్కడే విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ వచ్చేవారు. శనివారం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై మాట్లాడేందుకు గవర్నర్ బంగ్లాలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయ అంశాలపై ఇక్కడ సమావేశాలు నిర్వహించొద్దని మంత్రికి అధికారులు సూచించారు.