E-PAPER

కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు: కేటీఆర్‌..

పంటలకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ఇచ్చేందుకు ఇష్టం లేకపోవటం వల్లే పంటలెండుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇది కాలం తెచ్చిన కరువు అసలే కాదని, కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. కరెంటు కష్టాలు, ఎరువుల గోస, తాగునీటికి తండ్లాటతో ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. కరువొచ్చి పంటలు ఎండిపోతున్నాయని సీఎం దొంగ మాటలు మాట్లాడుతున్నారని, గత వానకాలంలో రాష్ట్రంలో 14 శాతం అధిక వర్షపాతం నమోదైందని గుర్తుచేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram