లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ తెలంగాణలో చేరికలపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన నాగర్ కర్నూల్, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలను పార్టీలో చేర్చుకుంది. మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు వెంకట్ రావులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జలగం వెంకట్ రావుకు ఖమ్మం సీటు ఇచ్చే ఆలోచనలో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్లు సమాచారం. అలాగే సీతారాం నాయక్ ను మహబూబాబాద్ నుంచి బరిలోకి దింపే ఛాన్స్ ఉంది.