E-PAPER

ఫేస్ బుక్ క్రాష్.. ఇన్ స్టా లో ఎర్రర్.. ఓపెన్ కాక దేశమంతా గగ్గోలు..

ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక సమస్యలతో ఫేస్‌బుక్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్‌డౌన్ కావడంతో ఫేస్‌బుక్ తోపాటు ఇన్‌స్టా‌గ్రామ్, మెసేంజర్ కూడా పనిచేయట్లేదు. లాగిన్ అవడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో యూజర్లు ట్విట్టర్ వేదికగా ఫేస్‌బుక్, ఇన్‌స్టా యాజమాన్యానికి ఫిర్యాదులు చేస్తున్నారు. భారతదేశంలో కూడా ఈ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

మెటా సంస్థకు చెందిన ఈ సర్వీసులు సాంకేతిక సమస్య కారణంగా భారత్ సహా పలు దేశాల్లో స్తంభించిపోవడంతో నెటిజన్లు తమ ఖాతాలను యాక్సెస్ చేయలేక ఇబ్బందులు పడుతున్నట్లు ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్ వెల్లడించింది. ఈ సాంకేతిక సాధనాలపై ఆధారపడిన కోట్లాది మంది ఎందుకిలా జరిగిందో అర్థంకాక.. ఆందోళన చెందుతున్నారు. త్వరగా సర్వీసులు పునరుద్ధరించాలంటూ ఇతర సోషల్ మీడియాల్లో పోస్టులు పెడుతున్నారు.

 

ఈ సాంకేతికపరమైన లోపం తలెత్తడంతో వినియోగదారులు ఫేస్‌బుక్, ఇన్‌స్టా యాప్‌లలో లోడింగ్ సమస్య ఏర్పడింది. పరస్పరం సందేశాలు పంపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు అనేక మంది ఈ సమస్యపై రిపోర్టు చేసినట్లు డౌన్ డిటెక్టర్ పేర్కొంది. కొందరు ఫేస్‌బుక్ ఖాతాను లాగ్ అవుట్ చేసి తిరిగి లాగిన్ కాలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది. అయితే, ఈ అంతరాయానికి సంబంధించి మెటా సంస్థ ఇంకా స్పందించలేదు. త్వరగా సమస్యను పరిష్కరించాలంటూ నెటిజన్లు మాత్రం ఇతర సోషల్ మీడియా వేదికలుగా మొరపెట్టుకుంటున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram