E-PAPER

కాంగ్రెస్ గూటికి డిప్యూటీ మేయర్ శ్రీలత..

జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఆ పార్టీకి.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు వరుసగా పార్టీని వీడటం గమనార్హం. ఫిబ్రవరి 13న తార్నాక డివిజన్ కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసింది.

 

గత కొంత కాలంగా బీఆర్‌ఎస్‌తో అసంతృప్తిగా ఉన్న డిప్యూటీ మేయర్‌ శ్రీలత రాష్ర్ట కాంగ్రెస్‌ ఇంచార్జీ దీపాదాస్‌ మున్షీ సమక్షంలో ఆ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేతలకు రాజీనామ సమర్పించినట్లు తెలుసుంది. శ్రీలతతో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు మరో ఆరు మంది కాంగ్రెస్‌లోకి చేరనునట్లు సమాచారం.

 

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపునుంచి బరిలో నిలిచేందుకు శ్రీలత సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగానే సికింద్రాబాద్ టికెట్‌ ఆశిస్తున్నట్లు తెలుస్తున్నపట్టికీ.. దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. భవిష్యత్తులో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. త్వరలో వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ చేరనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డి సతీమణి వికారాబాద్ జెడ్పీ ఛైర్మన్ పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ క్రమంలోనే త్వరలో మరింత మంది కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు క్యూ కట్టనున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram