E-PAPER

ఐ ఎన్ టి యు సి యూనియన్ డైరీ ఆవిష్కరణ

జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రం లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం లో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఐ ఎన్ టి యు సి జోగుళాంబ గద్వాల్ జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాశ్ ఆధ్వర్యం లో ఐ ఎన్ టి యు సి డైరీ 2024 ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ శశికళ మరియు జిల్లా డిప్యూటి డి ఎమ్ హెచ్ ఓ, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సిద్ధప్ప గార్ల చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లో ప్రోగ్రామ్ ఆఫీసర్ లు డాక్టర్ ఇర్షాద్, డాక్టర్ రాజు, సుపరిందెంట్ మునిప్రసాద్, ఏ ఎస్ ఓ తిరుమల రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వెంకటేష్, జిల్లా యూనియన్ నాయకులు రామకృష్ణ, సాదిక్, అక్కమ్మ, శ్రీనివాసులు,నాగషేశయ్య, అబ్రహం, చంద్రన్న, హనుమంతు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram