E-PAPER

భారత్ వికాస్ పరిషత్ బివిపి ఆధ్వర్యంలో హోటల్ యజమాని రాధికకు ఘనంగా సన్మానం.

సూరారం చౌరాస్తా , మస్థానా బిల్డర్స్ , వెంకట్ రామ్ నగర్ , బచ్పన్ పాఠశాల ఎదురుగా* రాధిక అనే మహిళ ప్లాస్టిక్ ప్లేట్లు వాడకుండా అరటాకుల్లో భోజనం అందిస్తానని తాను ఈ హోటల్లో పర్యావరణాన్ని కాపాడే విధంగా నడిపిస్తున్నానని చెప్పడం జరిగింది. అది చూసి పర్యావరణ ప్రేమికుడు భారత్ వికాస్ పరిషత్ అబ్దుల్ కలాం బ్రాంచ్ కార్యదర్శి కోల రవీందర్ ముదిరాజ్ శుక్రవారం రాధికాను శాలువతో సత్కరించడం జరిగింది. భోజన ప్రియులు ఇలాంటి హోటల్లో అరిటాకులో భోజనం చేసి పర్యావరణానికి సహకరించాలని కోరారు .ఇలాంటి హోటల్ యజమానులకు జిహెచ్ఎంసి అధికారులు వివిధ కాలనీ సంఘాలు దేవస్థాన కమిటీలు సహకరించాలని పర్యావరణాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు.ఎవరైనా పార్సెల్ కొరకు వచ్చినట్టయితే ఇంటి నుండే టిఫిన్ బాక్సులు తెచ్చుకోవాలని తెలియజేయడం జరిగింది ఎవరైనా హోటల్ యజమానులు ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనాలు వడ్డిస్తే అటువంటి వారిపై జిహెచ్ఎంసి వారు కఠిన చర్యలే కాకుండా చెత్త సేకరించేవారు ప్లాస్టిక్ తో తయారైన ప్లేట్లను సేకరించకుండా జిహెచ్ఎంసి వారు ఆదేశించాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో మొబైల్ వేణు ,సంతోష్ పాల్గొన్నారు.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram