మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత తాను చేయబోయే ప్రతీ సినిమాపై చరణ్ ప్రత్యేకంగా కాన్సంట్రేట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నాడు.
ఇందులో చరణ్.. తండ్రీ, కొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో ప్రభుత్వ అధికారి నుంచి సీఎంగా ఎలా ఎదిగాడు.. ఆయన అంత ఎత్తుకు ఎదగడానికి గల కారణాలేంటి అనే అంశాలతో ఈ మూవీను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేసాయి. అంతేకాకుండా ఈ మూవీలోని కేవలం ఒక్కపాట కోసం దాదాపు రూ.15 కోట్ల ఖర్చు చేశారని ఆ మధ్య టాక్ వినిపించింది. ఈ వార్తతో సినిమా ఏ లెవెల్లో ఉంటుందో అందరూ ఊహించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మూవీ తర్వాత చరణ్ లైనప్‌లో మరో చిత్రం కూడా ఉంది. ‘ఉప్పెన’ మూవీ ఫేం బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ మూవీ కోసం నటీ నటుల ఎంపికలో చిత్రబృందం బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఈ సినిమాలో చరణ్‌కు సరిపడా జోడీ కోసం తెగ వెతికేస్తున్నారట. ఇప్పటికే హీరోయిన్‌గా పలువురి పేర్లు పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే అందులో ఓ హీరోయిన్‌ను మేకర్స్ సెలెక్ట్ చేసినట్లు సమాచారం.
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ని ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెనే ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే.. టాలీవుడ్‌లో స్టార్ హీరోతో ఆమె చేస్తున్న సెకండ్ మూవీ ఇదే అవుతుంది. కాగా ఆమె ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ‘దేవర’ మూవీలో నటిస్తోంది. ఈ మూవీతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ షూటింగ్ లేట్ కావడంతో ఆగష్టు లేదా సెప్టెంబర్‌కు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని గుస గుసలు వినిపిస్తున్నాయి.