E-PAPER

మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్…

బీఆర్‌ఎస్‌ పాపాల పుట్టలో ఒకటైన మేడిగడ్డ బ్యారేజ్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ సర్కార్‌ విధించిన విజిలెన్స్‌ విచారణకు సంబంధించిన రిపోర్ట్‌.. బిగ్‌ టీవీ సంపాదించింది. ఈ బ్యారేజ్‌కు సంబంధించి కేసీఆర్‌ సర్కార్‌ భారీగా అంచనాలను పెంచేసినట్టు విజిలెన్స్‌ విచారణలో తేలింది. మేడిగడ్డ ప్రాజెక్ట్‌ మొదట అంచనా 2 వేల 472 కోట్లు కాగా.. వాటిని ఏకంగా 133.67 శాతం పెంచి 4వేల 321 కోట్లు ఖర్చు చేసింది కేసీఆర్ సర్కార్. ఈ విషయాలను ఆధారాలతో సహా ప్రూవ్‌ చేసింది విజిలెన్స్.

 

నిధుల పరంగా పరిస్థితి ఇలా ఉంటే డ్యామ్‌ కుంగిపోవడానికి గల అనేక కారణాలు,అనుమానాలను తెరపైకి తీసుకొచ్చింది విజిలెన్స్‌. డ్యామ్‌ నిర్మాణం పూర్తయ్యాక కాఫర్ డ్యామ్‌, షీట్ పైల్స్‌ను తొలగించకపోవడం వల్లే పియర్స్‌ కుంగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసింది. నదీ సహజ ప్రవాహంపై కాఫర్ డ్యామ్ ప్రభావం పడిందని తేల్చింది. అంతేకాదు డిజైన్‌లో ఉన్నట్లుగా కటాఫ్ వాల్స్‌కు, రాఫ్ట్ వాల్స్‌కు మధ్య నిర్మాణం జరగలేదని కూడా విజిలెన్స్‌ విచారణలో తేలింది.

 

ఇదే కాకుండా మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది విజిలెన్స్ రిపోర్ట్. ఇటీవల లీకైన 6, 7, 8 పిల్లర్లను అస్సలు కాంట్రాక్ట్ సంస్థ ఎల్ అండ్ టీ నిర్మించలేదన్న విషయం విచారణలో తేలింది. ఆ పిల్లర్లను సబ్ కాంట్రాక్ట్ సంస్థ నిర్మించిందని.. దీనికి సంబంధించినపూర్తి ఆధారాలను విజిలెన్స్ సేకరించింది.

 

అసలు 137 శాతం అంచనాలు ఎందుకు పెరిగాయి? పెరిగిన అంచనాల ప్రకారం ఖర్చు చేసిన నిధులు నిజంగానే ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉపయోగించారా? లేక గులాబీ నేతల జేబుల్లోకి వెళ్లాయా? ఎల్‌ అండ్ టీ లాంటి సంస్థ కాకుండా ముఖ్యమైన నిర్మాణాలు సబ్‌ కాంట్రాక్టర్లకు ఎందుకు ఇచ్చారు? దీని వెనకున్న లొసుగులేంటి? అన్న దానిపై విజిలెన్స్ మరింత ఫోకస్ పెట్టింది. ఇప్పుడు విజిలెన్స్‌ రిపోర్ట్‌కు అనుగుణంగా చర్యలు బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అవుతోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram