E-PAPER

బీఆర్ఎస్ కు బిగ్ షాక్..!

హైదరాబాద్: ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి లు గురువారం సీఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో ‘పట్నం’ ఫ్యామిలీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ , మాజీ మంత్రి పట్నం మహేంధర్ రెడ్డి , హ్యాట్రిక్ జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి లతో పాటు, యువ నాయకుడు పట్నం రినీష్ రెడ్డి లు ముఖ్య మంత్రి తో పలు రాజకీయ అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీగా సునీతారెడ్డిని చేవెళ్ల ఎంపి అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీకి దింపేందుకు పట్నం వ్యూహంగా కనిపిస్తోంది.అందులో భాగంగా జరిగిన చర్చల అనంతరం మే పట్నం మహేందర్ రెడ్డి గురువారం రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారని ప్రచారం జరుగుతుంది. మహేందర్ రెడ్డి దంపతులు ఈ నెల 11లోపు కాంగ్రెస్ పార్టీ లో చేరే అవకాశం ఉంది? కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు ఉన్నారు.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram