కె యూ క్యాంపస్.కాకతీయ విశ్వవిద్యాలయంలో టూరిజం విభాగానికి చెందిన బొల్లారం సంజీవ కి టూరిజంలో డాక్టరేట్ ప్రకటించినట్టు పరీక్షల నియంత్రణ అధికారి పి.మల్లారెడ్డి తెలిపారు.హన్మకొండ జిల్లా పరకాల మండలం మళ్ళక్కపేట గ్రామానికి చెందిన సంజీవ పుట్టుకతోనే అంగవైకల్యం కలిగి ఉండటంతో అనేక ఇబ్బందులు పడ్డారు,అయినప్పటికీ కుంగిపోకుండా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివి అంగవైకల్యంన్నీ సైతం జయించి మళ్ళక్కపేట గ్రామంలోనే మొదటి డాక్టరేట్ పట్టా సాధించాడు,విశ్రాంత ఆచార్యులు,తక్కాలాపల్లి దయాకర్ రావు పర్యవేక్షణలో “ఇంపాక్ట్ ఆఫ్ టూరిజం ఆన్ సోసిఓ-ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఏ స్టడీ ఆఫ్ నార్త్ తెలంగాణ”అనే అంశంపై జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో పబ్లికేషన్స్ చేశారు,డాక్టరేట్ సాధించిన బొల్లారం సంజీవ ని ఈ సందర్భంగా పలువురు బోధన, బోధనేతర సిబ్బంది, తోటి పరిశో ధకులు, స్నేహితులు గ్రామస్థులు అభినందించారు.