పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత.. పదవికి రాజీనామా చేశారు. నిన్న బీఆర్ఎస్ ను వీడి.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి.. మరో షాకిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లో సిద్ధాంతాలు కొరవడ్డాయని అన్నారు. పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని తాను కానన్నారు.
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనకు.. ఈసారి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతోనే పార్టీ వీడారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి పెద్దపల్లి ఎంపీ టికెట్ బాల్కసుమన్ కు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా.. ఎంపీ వెంకటేష్ 2019 లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి.. బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. తాజాగా బీఆర్ఎస్ ను వీడి.. మళ్లీ హస్తం గూటికి చేరారు. జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో.. ఆయన మళ్లీ పెద్దపల్లి నుంచే కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది.