E-PAPER

తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ..?

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారని ఢిల్లీలోని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. ఆమెను రాష్ట్రం నుంచి పోటీ చేయించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటన ఈ వార్తలకు బలం చేకూర్చుస్తోంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గతంలో మెదక్ స్థానం నుంచి పోటీ చేసిన విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్నిఇచ్చిన సోనియా ఈసారి ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేయాలని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సోనియా గాంధీని రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరారు.

 

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్‌ లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ నుంచి బరిలో నిలిచారు. అయితే హిందీ బెల్ట్ స్థానం అమేథీలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో అమేథీలో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. 2019 ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలీ లోక్ సభ స్థానం నుంచి సోనియా గాంధీ గెలిచారు. 2024 ఎన్నికల్లో యూపీలోని కాంగ్రెస్ తన ఏకైక లోక్‌సభ స్థానాన్ని కోల్పోవచ్చని రాజకీయ పండితులు అంటున్నారు. ఈసారి ఆ సీటు ఆమెకు సురక్షితం కాదని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని ఖమ్మం సీటుకోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆమె సోనియాగాంధీ కానీ ప్రియాంకా గాంధీ కానీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా భారీ మెజారిటీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. వారు పోటీ చేయకపోతే తనకు అవకాశమివ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని భట్టి విక్రమార్క భార్య నందిని కోరారు. కాంగ్రెస్‌ ఎంపీ టికెట్లకు ఆశావహుల నుంచి భారీ స్పందన వచ్చింది. 17 పార్లమెంటు స్థానాలకు మొత్తం 306 దరఖాస్తులు చేశారు.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram