మిషన్ భగీరథ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై ఫోకస్ చేసింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్‌పై న్యాయ విచారణ చేపట్టిన ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రాజెక్టు అవినీతిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ప్రాజెక్టులో సెకండరీ, ఇంట్రా పైప్‌లైన్ నెట్‌వర్కలో భారీ మొత్తంలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. దాదాపు రూ. 7 వేల కోట్ల వరకు గత ప్రభుత్వ నేతలు దోచుకున్నట్లు సమాచారం అందడంతో ఈ ప్రాజెక్టుపై విచారణ చేపట్టాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అసలీ ప్రాజెక్టులో ఏం జరిగిందో నిగ్గు తేల్చాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం రూరల్ వాటర్ సప్లై పైప్ లైన్లలు మిషన్ భగీరథకు వాడారని.. పైకి కొత్త లైన్లు నిర్మించినట్లు రికార్డు చేశారు. ఇంటింటికీ నల్లా పేరుతో భారీగా దోచుకున్నారని అనుమానిస్తోంది సర్కార్. ఫేక్ బిల్స్ తయారు చేసి చేయని పనికి కూడా పెద్ద మొత్తంలో మింగేసారని విజిలెన్స్ విచారణ చేపట్టాలని యోచించినట్లు తెలుస్తోంది.