ఏపీ ఎన్నికల్లో అధికారమే టార్గెట్‌గా కాంగ్రెస్ చీఫ్ షర్మిల దూకుడు పెంచారు. జగన్ పాలనపై వ్యతిరేకతను పెంచి ఓటర్లను తమవైపుకు తిప్పుకునే వ్యూహంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రాంను నేడు బాపట్ల నుంచి ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు షర్మిల. ఆ తర్వాత గురువారం తెనాలి నియోజకవర్గంలో ఉదయం 10 గంటలకు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరులో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు.
అలాగే 9న ఉదయం కొవ్వూరులో రచ్చబండ, సాయంత్రం 5 గంటలకు తునిలో బహిరంగ సభ, 10వ తేదీన ఉదయం నర్సీపట్నంలో రచ్చబండ , సాయంత్రం పాడేరులో బహిరంగ సభ, 11 న నగరిలో బహిరంగ సభలో పాల్గొంటారు.
APCC వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ అలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం షర్మిలకు భద్రత పెంచాలని మంగళవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీమతి షర్మిల భద్రతను 4+4 నుంచి 1+1కి తగ్గించారని వారు ఆయనకు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆమె బహిరంగ సభలలో రాష్ట్ర ప్రజల బాధల గురించి వివిధ అంశాలలో గళం విప్పినందుకే ఈ చర్య తీసుకున్నారని తెలిపారు.