E-PAPER

సిఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్*

రంగారెడ్డి జిల్లా ప్రతినిథి : బీఆర్ఎస్ పార్టీకి మరో నేత గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ అధిష్టాన నాయకులు కేసి వేణుగోపాల్ ను కలసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క,మల్లు రవి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,చల్ల వంశీచంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram