E - PAPER

E-PAPER

మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

మరో ఉదయం/జవహర్ నగర్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీత రావు ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజవర్గ ఏ బ్లాక్, బి బ్లాక్ మహిళా నాయకులు కార్యకర్తలతో కలిసి సోమవారం జవహర్ నగర్ లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు లక్ష్మీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ , సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలో 6 గ్యారంటీ లలో ఇప్పటికే ఆర్టీసీ బస్సుల ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. నిన్న గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గ్యాస్ సిలీండర్ 500 రూపాయలకే అందిస్తామని కేబినెట్ లో ఆమోదించడం జరిగిందనీ, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని రాబోయే ఎంపీ ఎన్నికల్లో జిల్లాలో మహిళలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ మహిళ అధ్యక్షులు అనంత లక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంటే ఓర్వలేని బిఅర్ ఎస్ పార్టీ నిందలు వెయ్యడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు సునీత, దమ్మయిగూడ మున్సిపాలిటీ మహిళా అధ్యక్షులు జూపల్లి శోభారాణి, తూముకుంట మున్సిపాలిటీ మహిళా అధ్యక్షులు నాగమణి, పోచారం మున్సిపాలిటీ అధ్యక్షులు మాధవి, జవహర్ నగర్ మున్సిపాలిటీ అధ్యక్షులు చింతా విజయ, ఎస్సీ సెల్ అధ్యక్షులు చింత సునీత , దమ్మయిగూడ మున్సిపల్ మహిళ ప్రధాన కార్యదర్శి ఈగ శ్వేత రాజు, కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు గుజ్జుక నర్మద పరుశురాం, మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram