ఎప్పుడైనా కథను నమ్ముకునే సినిమాలు తీయాలని టాలీవుడ్ దర్శకుడు, నటుడు SV కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. హీరోకు అనుకూలంగా సినిమాలు చేయాలనుకున్నప్పుడే సమస్య వస్తుందని, తాను చేసిన టాప్ హీరో, వజ్రం సినిమాలు అందుకే ఫెయిలయ్యాయని చెప్పారు. గుంటూరు కారం మూవీని హీరో స్టార్డమ్‌కు అనుకూలంగా చేయడంతోనే తేడా కొట్టిందన్నారు.